పరీక్షల నిర్వహణలో మార్పులు | Changes in the administration of the exam | Sakshi
Sakshi News home page

పరీక్షల నిర్వహణలో మార్పులు

Published Mon, Jul 28 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

Changes in the administration of the exam

గతంలో పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు గానూ 11 ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్లుండేవి. ఒక్కో సబ్జెక్టులో (రెండు పేపర్లు కలిపి) వంద మార్కులకు ప్రశ్నపత్రాలు రూపొందించేవారు. రెండు పేపర్లలో కలిపి ప్రతి సబ్జెక్టులో 35శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లే.
 
 నూతనం విధానంలో 11 పేపర్లను తొమ్మిదికి కుదించారు.
 
 తెలుగు, హిందీ, ఇంగ్లిష్ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఒకటే ప్రశ్నపత్రం పేపరు 80 మార్కులకు ఉంటుంది.
 
 సైన్స్, గణితం, సోషల్ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉంటాయి.
 
 ఒక్కో పేపరులో కేవలం 40 మార్కులకు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
 
 ప్రతి పేపర్‌లోనూ 35శాతం మార్కులు రావాలి.
 
 ఏ పేపర్లో 35శాతం మార్కులు రాకపోయినా విద్యార్థి పరీక్ష తప్పినట్లే.
 
 మిగిలిన 20 శాతం మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు(పాఠశాలలో నిర్వహించే అంతర్గత పరీక్షలు) కేటాయిస్తారు. వీటిని పబ్లిక్ పరీక్షల మార్కులకు కలుపుతారు.
 
 20శాతం మార్కులు కేటాయించేందుకు సంవత్సరకాలంలో నాలుగు ఫార్మాటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు.
 
 ఇంటర్నల్ పరీక్షల్లోనూ 35శాతం మార్కులు పొందాలి.
 
 బోర్డు ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు పాఠశాలలకు వెళ్లి అంతర్గత పరీక్షలలో వచ్చిన మార్కుల సగటును నిర్ధారిస్తారు. వాటిని  పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు కలుపుతారు.
 
 ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించేందుకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించారు.
 
 ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి ప్రగతి నమోదు రికార్డును నమోదు చేయాల్సి ఉంటుంది.
 
 విద్యార్థులకు మేలు జరుగుతుంది

 పాత విధానంలో రెండు మూడు నెలలు చదివితే పరీక్షల్లో పాసయ్యేవారు. అది పూర్తిగా బట్టీ విధానం. సీసీఈ విధానంలో విద్యార్థుల ఆలోచనశక్తి, సృజనాత్మకశక్తి పెరుగుతుంది. అన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ విధానంలో విద్యార్థి స్వతంత్రంగా పరిశోధనలు చేసే స్థాయికి ఎదుగుతాడు. ఎంతో మేలు జరుగుతుంది.
 - జె.సాయిరాంప్రసాద్, కరస్పాండెంట్, శారదా రామకృష్ణ విద్యాలయం, విజయవాడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement