ద్వారక తిరుమలలో చిరుత కలకలం
సాక్షి, పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమల మండల పరిధిలోని తిరుమనంపాలెం గ్రామంలో చిరుతపులి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో చిరుత ఉన్న విషయం దావనంలా వ్యాపించడంతో ఇరుగుపొరుగులు భయం భయంగానే చిరుతను చూసేందుకు గుమిగూడారు.
అయితే గ్రామంలో చిరుత సంచారంపై గ్రామస్తులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారు. దీంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగామాడొద్దంటూ, వెంటనే చిరుతను బంధించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.