రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారాన్ని అపహరించడం, నకిలీ బంగారాన్ని అమ్మడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారాన్ని అపహరించడం, నకిలీ బంగారాన్ని అమ్మడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలోని యలమంచిలిలో బంగారం పేరుతో దుండగులు మోసానికి పాల్పడ్డారు.
స్వచ్చమైన బంగారమని చెప్పి, ఓ కుటుంబాన్ని నమ్మబలికిన దుండగులు నకిలీ బంగారాన్ని కట్టబెట్టి సుమారు 8.50లక్షల రూపాయల సొమ్ముతో ఉడాయించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధిత కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు చెప్పారు.