
తిరుమలను హెరిటేజ్ తిరుమలగా మార్చుతారేమో?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను తన వ్యాపారాలకు వాడుకోవడం దారుణమని చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల కొండపై హెరిటేజ్ పార్లర్కు అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన బుధవారమిక్కడ సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు తిరుమలను తన జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డి విమర్శించారు. టీటీడీ అధికారులు కూడా బాబుకు వంతపాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తిరుమల పేరును కూడా హెరిటేజ్ తిరుమలగా మార్చినా ఆశ్చర్యపోనక్కలేదని చెవిరెడ్డి అన్నారు.