గొల్లపల్లి, న్యూస్‌లైన్ : చిల్వకోడూరులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల కథ నం ప్రకారం... చిల్వాకోడూర్‌కు చెందిన బూడిగం సుధాకర్- లక్ష్మి దంపతులకు కూతురు స్రవంతి(7) ఉంది. లక్ష్మి సోదరిని వెల్గటూర్ మండలం గుళ్లకోటకు చెందిన గర్వందుల అంజికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు అవంతి(9 నెలలు) ఉంది. అంజి ఆదివారం అత్తగారి ఊరైన చిల్వాకోడూర్‌కు వచ్చాడు. సుధాకర్ ఇల్లు, అంజి అత్తగారిల్లు పక్కపక్కనే ఉన్నాయి. అంజి తన కూతురు అవంతిని భుజాన ఎత్తుకుని సుధాకర్ కూతురు స్రవంతిని చేతపట్టుకుని సుధాకర్ ఇంటినుంచి పక్కనే ఉన్న అత్తగారింటికి నడుస్తున్నాడు.
ఇంతలో ధర్మపురి మండలం బీరుసానికి చెందిన వేముల జగన్ కారులో గొల్లపల్లి నుంచి ధర్మారం వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి వెనకనుంచి వీరిని ఢీకొట్టాడు. స్రవంతి అక్కడికక్కడే దుర్మర ణం చెందగా, అంజికి, అతడి చేతుల్లో ఉన్న అవంతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి అవంతి చని పోయింది.
అంజి పరిస్థితి కూడా విషమించడంతో కరీంనగర్ తరలించారు. ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమా దం జరిగిన వెంటనే కారుడ్రైవర్ జగన్ పరారయ్యాడు. సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు.
చిన్నారులను బలిగొన్న కారు
Published Mon, Oct 7 2013 3:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement