బతికినంత కాలం నటిస్తా..
కొవ్వూరు రూరల్: సినిమా ప్రపంచం తప్ప తనకు ఏదీ తెలియదని, జీవించినంత కాలం సినిమాల్లో నటిస్తుంటానని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. దొమ్మేరులో ‘గజదొంగ’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన మంగళవారం విలేకరులతో ముచ్చటించారు.
మీ సినిమా రంగ ప్రవేశం
21వ ఏట మద్రాసు వచ్చాను. పరుచూరి బ్రదర్స్ నాకు సహాయపడ్డారు. వారి వద్ద సహాయ రచయితగా చేరాను.
రైటర్‌గా మీ మొద టి సినిమా
పోలీస్ బ్రదర్స్. మంచి హిట్ అయ్యింది. దీనితోనే రచయితగా నా జీవితాన్ని ప్రారంభించాను.
ఎన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు
సుమారు 100 సినిమాలకు పైగానే. పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, అయోధ్యరామయ్య, శివయ్య వంటి సినిమాలు సంతృప్తినిచ్చాయి.
నిర్మాతగా మీ అనుభవం
నిర్మాతగా శ్రావణమాసం సినిమా తీసి నష్టపోయాను. తరువాత ఆపరేషన్ దుర్యోధన సినిమా మంచి హిట్ సాధించింది. నష్టాల నుంచి బయటపడ్డాను.
ఈ ఏడాది ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు
సుమారు 25 చిత్రాల్లో..
కుటుంబ నేపథ్యం
భార్య కుసుమలత, ఇద్దరు అబ్బాయిలు ఉజ్వల్, ప్రజ్వల్. పెద్ద అబ్బాయి బీఎస్సీ చదువుతున్నాడు. చిన్నవాడు నటనలో శిక్షణ పొందడానికి ఆసక్తి చూపతున్నాడు.