హాయ్‌ల్యాండ్‌లో క్రిస్మస్ వేడుకలు
Published Thu, Dec 26 2013 3:34 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
చినకాకాని (మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్ : చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా హాయ్‌ల్యాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ ట్రీలతో, శాంటాక్లాజ్ వేషధారులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని తెలియజేస్తూ పార్కు ఆవరణలో పశువుల పాకను ప్రత్యేకంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన గుంటూరు ఏసీ కళాశాల అధ్యాపకులు బ్రదర్ సురేష్, హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు, శేఖర్‌లతో కలసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ సురేష్ మాట్లాడుతూ ప్రేమ, శాంతికి చిహ్నంగా నిలిచే పర్వదినం క్రిస్మస్ అని అన్నారు. క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని సూచించారు.
Advertisement
Advertisement