సాక్షి,సిటీబ్యూరో:
నగరంలో రోడ్లు తరచూ పాడుకాకుండా పక్కాచర్యలు తీసుకోనున్నట్లు గ్రేటర్ మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు స్పష్టం చేశారు. ఇందుకుగాను ఇతర ప్రభుత్వశాఖలు రోడ్లు తవ్వితే..సంబంధిత విభాగాల ఇంజనీర్లపై, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీలో 2013లో చేసిన పనులు..కొత్తేడాదిలో చేపట్టబోయే పనుల గురించి మేయర్,కమిషనర్‌లు కూలంకషంగా మంగళవారం మీడియాకు వివరించారు. సమగ్రరహదారి ప్రాజెక్టుపనుల కింద 53 రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిం చామని, ఇందుకు రూ.230-రూ.400 కోట్లమేరఖర్చు కానుందన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలోనే అవసరమైన వరదనీటి కాల్వలు, డక్ట్‌లు, మీడియన్లు తదితరమైనవి నిర్మిస్తామని, వీటి నిర్మాణం పూర్తయ్యాక ఎవరైనా త వ్వితే క్రిమినల్ కేసులు తప్పవని సూచించారు. కొన్నేళ్లయినా రోడ్లు మన్నికగా ఉండేందుకు ఈ మాత్రం చర్యలు తప్పవన్నారు. ఏటా రోడ్లకోసం వందలకోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్తేడాదిలో దాదాపు రూ.1200 కోట్ల మేర ఇంజనీరింగ్ పను లు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంకా పెం డింగ్‌లో ఉన్న 3వేల బీపీఎస్, 4వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించడమో, తిరస్కరించడమో చేస్తామని వారు వెల్లడించారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు..: జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఫిర్యాదుల్లో అధికశాతం టౌన్‌ప్లానింగ్‌వే ఉంటుండడంతో ఆ విభాగంలో సమస్యల పరిష్కారానికి భవన నిర్మాణ అనుమతులను సరళీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సిటిజన్‌చార్టర్ అమల్లో భాగంగా జాప్యానికి కారకులయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. నీడలేని వారికి ఉపకరించేలా ఆస్పత్రులు, తదితర అవసరమైన ప్రాంతాల్లో నైట్‌షెల్టర్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
విగ్రహాలు తరలిస్తాం : జీహెచ్‌ఎంసీ ఆవరణలో దాదాపు మూడేళ్లుగా ముసుగుతో ఉన్న విగ్రహాలను తన హయాంలోనే తొలగిస్తానని మేయర్ మాజిద్‌హుస్సేన్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. గతంలో వాటి ఏర్పాటుకు స్టాండింగ్‌కమిటీలో తీర్మానం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని తొలగించేందుకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. స్వర్గీయ వైఎస్ విగ్రహ ఏర్పాటుకు స్టాండింగ్‌కమిటీ ఆమోదం ఉండగా..ఆ విగ్రహం ఆవిష్కరణకు ముందు అంబేద్కర్, గాంధీ, తదితరుల విగ్రహాలను ప్రతిపక్ష టీ డీపీ వైఎస్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసింది. వైఎస్ విగ్రహం కంటే జాతీయనాయకుల విగ్రహాలు తక్కువ ఎత్తువి కావడంతో..వాటిని ఆవిష్కరించకుండా ముసుగులు కప్పి ఉంచారు.
రోడ్లు తవ్వితే ఖబడ్దార్
Published Wed, Jan 1 2014 3:53 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM
Advertisement