commissioner somesh kumar
-
ముసాయిదా నేడు విడుదల
{పజల ముందుకు కొత్త డివిజన్లు సిద్ధమైన ముసాయిదా జాబితా అభ్యంతరాలకు వారం గడువు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో కీలకఅంకానికి బుధవారం తెర లేవనుంది. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా జాబితాను నేడు విడుదల చేయనున్నారు. దీన్ని ప్రజల ముందుంచి... వారి అభ్యంతరాలు స్వీకరించేందుకు వారం రోజుల గడువునిస్తారు. డీలిమిటేషన్‌పై దాదాపు ఆరు నెలలుగా కసరత్తు సాగుతుండడం... ఈ నేపథ్యంలో వివిధ పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. వార్డుల మధ్య సమతుల్యత కోసం 2011 జనాభా లెక్కల మేరకు సమాన జనాభా ఉండేలా డివిజన్లను రూపొందించాలనుకున్నారు. తొలుత 172 డివిజన్లు ఏర్పాటు కాగలవని భావించారు. అనంతరం 200 డివిజన్లకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తరువాత సహజ సరిహద్దులు.. ఇతరత్రా ఇబ్బందుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో 150 డివిజన్లనే కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని డివిజన్లలో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చూసేందుకు అధికారులు తిరిగి కసరత్తు చేపట్టారు. 150 సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. కొన్ని సర్కిళ్లలో డివిజన్లు పెరగనున్నాయి. కొన్ని సర్కిళ్లలో తగ్గనున్నాయి. ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. జనాభాకు అనుగుణంగా కొత్త డివిజన్లు ఉంటాయన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలు, వివిధ వర్గాల నుంచి అందే విజ్ఞప్తులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే ముసాయిదాలో మార్పుచేర్పులు చేస్తామని చెప్పారు. కొత్తగా వచ్చే డివిజన్లలో చిలుకానగర్, భారతీనగర్, అల్లాపూర్ వంటివి ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు సగటున 40 వేల నుంచి 47 వేల జనాభా ఉండే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటు కానున్న డివిజన్లు సర్కిళ్ల వారీగా ఇలా ఉన్నాయి. వీటిలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. -
ఆనందం..ఆందోళన
వేతనాల పెంపుతో ఆనందం జీహెచ్ఎంసీ కార్మికుల సంబరాలు వామపక్షాల బంద్ ప్రశాంతం నగరంలో ఆందోళనలు వివిధ పార్టీల నేతలు అరెస్ట్ వేతనాల పెంపుతో జీహెచ్ఎంసీ కార్మికుల్లో నూతనోత్సాహం. ఎక్కడికక్కడ సంబరాలు. బాణసంచా కాలుస్తూ... మిఠాయిలు పంచి పెట్టుకుంటూ...రంగులు చల్లుకుంటూ... ఉల్లాసంగా కనిపించారు. సీఎం కేసీఆర్ కటౌట్లకు క్షీరాభిషేకాలు చేశారు. కార్మిక సంఘాల నేతలు కమిషనర్ సోమేశ్ కుమార్‌ను కలసి.. కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నుంచి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు తలపెట్టిన బంద్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి... సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కార్మికుల సమ్మె ముగిసింది. వేతనాల పెంపుతో... 11 రోజుల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి హామీ... కమిషనర్ ఆదేశాలతో 15వ తేదీనే మెజార్టీ కార్మికులు విధులకు హాజరు కాగా, కొన్ని కార్మిక సంఘాలు సమ్మె కొనసాగించాయి. సమ్మె కారణంగా పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం నాటికే చాలా ప్రాంతాల్లో తరలించారు. మిగిలిపోయిన చెత్తపై శుక్రవారం దృష్టి సా రించారు. ఇక ‘స్వచ్ఛ’ వైపు అడుగులు పడబోతున్నాయి. సంబరాలు... కార్మికుల వేతనాలను పెంచుతూ గురువారం రాత్రి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంఈయూ, జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. కార్మిక నాయకులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. మున్నెన్నడూ లేనివిధంగా ఒకేసారి రూ.4 వేలు పెంచిన ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వేతనాల పెంపులో కీలక పాత్ర పోషించిన జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్నుకలసినకార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోనే రెండు పర్యాయాలు వేతనాలు పెంచిన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి...కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కార్మికులు స్వీట్లు ఇచ్చారు. కార్యక్రమాల్లో జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.అమరేశ్వర్, నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు కార్మికులు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు స్వీట్లు తినిపించారు. మరింత నిబద్ధతతో పని చేయాలి కార్మికుల వేతనాలు పెరిగినందున మరింత అంకితభావంతో పని చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రతువులో కార్మికుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే బాధ్యత వారి చేతుల్లోనే ఉందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో కార్మికుల పనితీరు మెచ్చి... వేతనాలు పెంచుతానని ప్రకటించిన సీఎం మాట నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. తిరిగి స్వచ్ఛ హైదరాబాద్ దిశగా పయనం సాగాలని... వేగం పెరగాలని పిలుపునిచ్చారు. మెచ్చేలా పని చేస్తాం తమ కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని, ఆయన మెచ్చేలా కార్మికులు పనిచేస్తారని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ అన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలతో ఆటంకాలు కల్పించాలని ప్రయత్నించినా... కార్మికులు చెక్కు చెదరలేదని తెలిపారు. కమిషనర్ సోమేశ్ కుమార్ పిలుపు మేరకు నగర ప్రజల ఆరోగ్యం కోసం విధుల్లో పాల్గొన్నారన్నారు. తెలంగాణ కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న ఆంధ్రా దళారుల ఆటలిక సాగవని హెచ్చరించారు. సీఎంపై నమ్మకంతోనే సమ్మెలో పాల్గొనలేదు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై నమ్మకంతోనే తమ యూనియన్ సమ్మెను వ్యతిరేకించిందని జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.అమరేశ్వర్ అన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు యూనియన్ నాయకులు దళారులుగా వ్యవహరిస్తూ తెలంగాణ కార్మికుల కష్టాన్ని దిగమింగుతున్నారని ఆరోపించారు. తొలగింపు తగదు సమ్మెలో ఉన్న కార్మికులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని బీఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శంకర్ అన్నారు. వేతనాల పెంపు కోసం సమ్మెలో పాల్గొన్న వారిపై కత్తి కట్టడం తగదన్నారు. ఈ విషయంలో సర్దుకుపోవాలని కోరారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ యూనియన్ తరఫున తిరిగి ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. -
జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్?
జంటనగరాల పాలన బాధ్యతలను చూసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు బుధవారంతో ముగిసిపోనుంది. అయితే ఎన్నికలు మాత్రం ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పెషలాఫీసర్‌ను నియమించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ సోమవారం భేటీ అయ్యారు. అప్పుడే పాలకమండలి గడువు, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. -
సమగ్ర సర్వేకు కసరత్తు
* సమీక్ష నిర్వహించిన జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరగనున్న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకున్నా 40 వేల నుంచి 50 వేల మంది వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో.. ప్రైవేటు విద్యాసంస్థలు, స్వయం సహాయక మహిళా గ్రూపులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, తదితరుల సేవల్ని విని యోగించుకుంటే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో ఉన్నారు. సర్వే నిర్వహణ సన్నాహకాల్లో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సర్వే ఎలా చేస్తే బాగుంటుంది.. పర్యవేక్షణ ఎలా ఉండాలి.. తదితర వివరాలపై ఒకటి రెండు రోజుల్లో నివేదిక రూపొందించాల్సిందిగా కమిషనర్ సూచించారు. * ఇంటింటి సర్వే నిర్వహణ కోసం జీహెచ్ఎంసీలో సిబ్బందితో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. * 19వ తేదీ సర్వేకు ఒక రోజు ముందు అంటే 18వ తేదీన కూడా సంబంధిత సిబ్బంది తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి సర్వే పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. * సర్వేలో కీలకమైన 9 అంశాలను సిద్ధంగా ఉంచుకోవలసిందిగా ప్రజలను కోరుతారు. * ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం సైన్యాన్ని పంపితే వినియోగించుకుంటారు. * జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే తీరును పర్యవేక్షించేందుకు 250 మంది నోడల్ అధికారులను నియమిస్తారు. * మరో 2వేల మందిని క్లస్టర్ ఇంచార్జిలుగా నియమిస్తారు. కలెక్టరేట్లో సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వేను విజయవంతం చే సేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏజేసీ సంజీవయ్య వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అవసరమైన సిబ్బంది వివరాల సేకరణపై బుధవారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 94 ప్రభుత్వ విభాగాలు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 32 విభాగాల నుంచే సిబ్బంది వివరాలు అందాయని ఏజేసీ పేర్కొన్నారు. నగరంలో సర్వే కోసం 36 వేల మంది సిబ్బంది అవసరం కాగా, అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి 16వేల మందే ఉన్నట్లు పలువురు అధికారులు ఏజేసీ దృష్టికి తెచ్చారు. సీపీవో బలరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 108 డివిజన్లను 8600 ఎన్యుమరేటర్ బ్లాకులుగా విభజించామన్నారు. ఆయా బ్లాకుల్లో 9 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ప్రొఫార్మాలో వివరాల నమోదుకు ముందు తగిన అధారాలను కూడా పరిశీలించాలని సీపీవో బలరాం సూచించారు. -
రోడ్లు తవ్వితే ఖబడ్దార్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో రోడ్లు తరచూ పాడుకాకుండా పక్కాచర్యలు తీసుకోనున్నట్లు గ్రేటర్ మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు స్పష్టం చేశారు. ఇందుకుగాను ఇతర ప్రభుత్వశాఖలు రోడ్లు తవ్వితే..సంబంధిత విభాగాల ఇంజనీర్లపై, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో 2013లో చేసిన పనులు..కొత్తేడాదిలో చేపట్టబోయే పనుల గురించి మేయర్,కమిషనర్లు కూలంకషంగా మంగళవారం మీడియాకు వివరించారు. సమగ్రరహదారి ప్రాజెక్టుపనుల కింద 53 రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిం చామని, ఇందుకు రూ.230-రూ.400 కోట్లమేరఖర్చు కానుందన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలోనే అవసరమైన వరదనీటి కాల్వలు, డక్ట్లు, మీడియన్లు తదితరమైనవి నిర్మిస్తామని, వీటి నిర్మాణం పూర్తయ్యాక ఎవరైనా త వ్వితే క్రిమినల్ కేసులు తప్పవని సూచించారు. కొన్నేళ్లయినా రోడ్లు మన్నికగా ఉండేందుకు ఈ మాత్రం చర్యలు తప్పవన్నారు. ఏటా రోడ్లకోసం వందలకోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్తేడాదిలో దాదాపు రూ.1200 కోట్ల మేర ఇంజనీరింగ్ పను లు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంకా పెం డింగ్‌లో ఉన్న 3వేల బీపీఎస్, 4వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించడమో, తిరస్కరించడమో చేస్తామని వారు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు..: జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదుల్లో అధికశాతం టౌన్‌ప్లానింగ్‌వే ఉంటుండడంతో ఆ విభాగంలో సమస్యల పరిష్కారానికి భవన నిర్మాణ అనుమతులను సరళీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సిటిజన్చార్టర్ అమల్లో భాగంగా జాప్యానికి కారకులయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. నీడలేని వారికి ఉపకరించేలా ఆస్పత్రులు, తదితర అవసరమైన ప్రాంతాల్లో నైట్‌షెల్టర్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. విగ్రహాలు తరలిస్తాం : జీహెచ్ఎంసీ ఆవరణలో దాదాపు మూడేళ్లుగా ముసుగుతో ఉన్న విగ్రహాలను తన హయాంలోనే తొలగిస్తానని మేయర్ మాజిద్‌హుస్సేన్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. గతంలో వాటి ఏర్పాటుకు స్టాండింగ్కమిటీలో తీర్మానం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని తొలగించేందుకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. స్వర్గీయ వైఎస్ విగ్రహ ఏర్పాటుకు స్టాండింగ్కమిటీ ఆమోదం ఉండగా..ఆ విగ్రహం ఆవిష్కరణకు ముందు అంబేద్కర్, గాంధీ, తదితరుల విగ్రహాలను ప్రతిపక్ష టీ డీపీ వైఎస్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసింది. వైఎస్ విగ్రహం కంటే జాతీయనాయకుల విగ్రహాలు తక్కువ ఎత్తువి కావడంతో..వాటిని ఆవిష్కరించకుండా ముసుగులు కప్పి ఉంచారు.