పెనుకొండ ఘాట్ రోడ్డు మూసివేత
అనంతపురం: అంతులేని విషాదాన్ని మిగిల్చిన పెనుకొండ బస్సు దుర్ఘటన కేసులో అధికారులు ఆలస్యంగా మెల్కొన్నారు. పెనుకొండ-మడకశిర ఘాట్ రోడ్డును నుంచి మూసివేస్తున్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. మడకశిర వచ్చే వాహనాలను ఎల్ జీబీ నగర్ మీదుగా పెనుకొండకు మళ్లించారు. కాగా బస్సు ప్రమాదంను అనంతంపురం జల్లా కోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది.
కాంట్రాక్టర్, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న వారిని విచారణకు హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసెందే. ముందే ఘాటు రోడ్డుపై వాహనాలను అనుమతించకపోతే ఘోర ప్రమాదం జరిగేదికాదని స్థానికులు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇదే మార్గంలో వాహనాలను అనుమంతించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.