రాజ్యాంగ పదవిలో ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఓ ప్రాంతానికి కొమ్ము కాస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర నేతలతో ఆయన సమావేశం కావటాన్ని వెంకటరెడ్డి తప్పు పట్టారు. సీమాంధ్రనేతలతో మీటింగ్ ఎలా పెడతారని ఆయన సీఎంను ప్రశ్నించారు.
సీఎం కిరణ్పై చర్యలు తీసుకోవాలని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సీఎం వ్యవహారిస్తున్న తీరు ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పదవిలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనరాదని తాను గతంలో నిర్ణయించుకున్నాను, ఆ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.