హైదరాబాద్: సరిహద్దు సమస్యలపై అంతర్గత విమర్శలు చేయడం తగదని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నరేంద్ర మోడీ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్దేశించి కిరణ్ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సరిహద్దు సమస్యలపై మాట్లాడటం తగదని కిరణ్ హితవు పలికారు. సరిహద్దు దేశాల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయన్న విషయాన్ని మోడీ మరచి మాట్లాడుతున్నారన్నారు. .రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యకు పరిష్కారం దొరకదని సీఎం సూచించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే ఏపీ లో పథకాలు బాగున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు మరిచి మాట్లాడారని, ఏపీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని గతంలో మేడీయే అన్నారని విషయాన్ని గుర్తు చేశారు. మోడీ పదవీ కాంక్షతో అసత్యాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మన్మోహన్ సింగ్‌పై, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేయడం మోడీకి మంచి పద్దతి కాదన్నారు. ఆయన చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు సీఎం తెలిపారు. రెండేళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల ఉద్యోగాలిచ్చిందన్నారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించామన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందున్నది సీఎం తెలిపారు. బంగారుతల్లి పథకం దేశంలోనే ఉత్తమమైన్నారు. ‘మనమే అందరికీ ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు మన పథకాల్నే అమలు పరిచేందుకు ఆసక్తి కనబరుస్తాన్నాయని’ అన్నారు.