
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కడప జిల్లా రైతుల నిరీక్షణకు తెరపడింది. ఎనిమిదేళ్ల కిందటి రబీ పంటల బీమా క్లెయిములకు ఎట్టకేలకు చెల్లింపులు జరిగాయి. 24,641 మంది రైతులకు బీమా కంపెనీ రూ. 119.44 కోట్లు చెల్లించింది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాలకు కంపెనీ ద్వారా నేరుగా సొమ్ము చెల్లిస్తూ సీఎం వైఎస్ జగన్ బటన్ ప్రెస్ చేశారు. అనంతరం సంబంధిత రైతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కడప జిల్లాలోని తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నిరీక్షణకు ముగింపు పలికినందుకు రైతులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో కూడా డబ్బులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. అరటి పంట విక్రయాల్లో సమస్యలు తీరాయా? లేదా? అని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా రైతులను ప్రశ్నించారు.
(చదవండి: సీఎం జగన్ చేతల మనిషి, ప్రచారానికి దూరం..)
అయితే, వ్యాపారస్తులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, కాన్పూర్ వంటి మార్కెట్లకు ఇక్కడ నుంచి అరటి పంట వెళ్తుందని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లు తెరుచుకున్నాయని, సరుకును బయటకు పంపుతున్నామని తెలిపారు. రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
(చదవండి: కరోనా కట్టడిలో ఏపీ ముందంజ)
Comments
Please login to add a commentAdd a comment