సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మూడోవిడత రచ్చబండ కార్యక్రమా న్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ సభల్లో పేదలకు సం క్షేమ ఫలాలు అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈనెల 11నుంచి 26వరకు మండలకేంద్రాల్లోనూ, మున్సిపాలిటీ వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నా రు. రచ్చబండ సభలను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క మిటీలో సర్పంచ్, మండల మహిళా సమాఖ్యలోని ఉత్సాహంగా ఉన్న సభ్యురాలు, ఒక అధికారి ఉంటారని చెప్పారు. మొత్తం 36 మండలాల్లో ప్రతిపాదించిన కమిటీల జాబితాను జి ల్లా ఇన్‌చార్జి మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు నివేదించామన్నారు. మంత్రి ఆమోదం లభించగానే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11న బోధన్‌లో మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తొలి రచ్చబండను ప్రారంభిస్తారని తెలిపారు.
పేదలకు లబ్ధి..
మూడో విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో సుమారుగా రెండు వేల నుంచి మూడు వేలమంది పేదలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పెం డింగ్‌లో ఉన్న 73,454 రేషన్‌కార్డుల దరఖాస్తులకు కూపన్లు, 41,369 మంది లబ్ధిదారులకు పెన్షన్లు, 11,179 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సం బంధించిన మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. కొత్తగా పెన్షన్లు, రేషన్‌కూపన్లు మం జూరు చేసిన వారికి డిసెంబర్ నుంచి లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. ఎస్సీలకు రూ.13.76 కోట్లు, ఎస్టీలకు రూ.3.65 కోట్లు మాఫీ చేసిన విద్యుత్తు బిల్లుల రశీదులను అందిస్తామన్నారు. ఇందిర మ్మ కలలు కార్యక్రమం ద్వారా వసతి గృహాలు, కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేస్తామని కలెక్టర్ వివరించారు. ప్రతిరోజు నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారికి అదే రోజు చేరుతుందని, ఆ వివరాలు జ్ట్టిఞ:ఙఙ్చఞ.జౌఠి.జీ:8080/్కక వెబ్‌సైట్‌లో నమో దు చేస్తారన్నారు. ఈ సమావేశంలో సీపీఓ నబీ, ఐకేపీ పీడీ వెంకటేశం, డీఎం, సీఎస్ దివాకర్, డీఎస్‌ఓ కొండల్‌రావు, హౌసింగ్ పీడీచైతన్యకుమార్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
రచ్చబండకు సర్వం సిద్ధం
Published Sat, Nov 9 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement