సాక్షి, నెల్లూరు : మర్రిపాడు వద్ద ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఈ భూపందేరాన్ని అడ్డుకోవాలని స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్రీకాంత్‌కు మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌతంరెడ్డి విన్నవించారు. మర్రిపాడు వద్ద దాదాపు 30 సెంట్లకు పైగా ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కట్టబెట్టనున్నట్టు గౌతంరెడ్డి చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఫోర్‌లేన్ రోడ్డు మంజూరు చేసిందన్నారు.
పట్టాలిచ్చే భూమి సైతం ఆ రోడ్డులో కలవబోతోందని కలెక్టర్ దృష్టికి గౌతంరెడ్డి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆ భూమికి పట్టాలు ఇవ్వడం వల్ల రోడ్డు విస్తరణ సమయంలో తిరిగి అదే భూమికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు ఆ ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వకుండా నిలిపి వేయాలని గౌతంరెడ్డి కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ ఉన్నారు. సమైక్య గర్జన
భూపందేరాన్ని అడ్డుకోండి
Published Wed, Dec 11 2013 3:24 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement