ఎంపీపీ ఎన్నికల్లో ఫ్యాన్ హవా | MPP elections fan symbol first place | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఎన్నికల్లో ఫ్యాన్ హవా

Published Sat, Jul 5 2014 2:57 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

ఎంపీపీ ఎన్నికల్లో ఫ్యాన్ హవా - Sakshi

ఎంపీపీ ఎన్నికల్లో ఫ్యాన్ హవా

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా సాగింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 46 మండలాలకు గాను 25 మండల పీఠాలను కైవసం చేసుకుంది. టీడీపీ 18 మండలాలకే పరిమితమైంది. నెల్లూరు రూరల్ మండలంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థికి వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయి. సూళ్లూరుపేట, కొండాపురంలో ఎన్నికలు వాయిదా పడ గా శనివారం నిర్వహించనున్నారు.
 
 మున్సిపల్ ఎన్నికల్లో పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభపెట్టిన విషయం తెలిసిందే. అయితే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం టీడీపీ నేతల ఎత్తులు పారలేదు. కొన్నిచోట్ల మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను వివిధ రకాలుగా బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. లేనిపక్షంలో మరికొన్ని ఎంపీపీ పీఠాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడేవని పార్టీ నాయకులు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఐదు వైఎస్సార్‌సీపీకి, ఒకటి టీడీపీకి దక్కాయి. గూడూరులో ఐదు మండలాలుండగా వైఎస్సార్‌సీపీ మూడు, టీడీపీ రెండు గెలుచుకున్నాయి. కోవూరు పరిధిలోని నాలుగు మండలాల్లో నాలుగు ఎంపీపీలను టీడీపీ, ఒకటి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్నాయి.
 
 కావలిలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీ పీకి చెరో రెండు దక్కాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరాయి. సూళ్లూరుపేటలో ఆరు మండలాలుండగా రెండు మండలాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, మూడింటిని టీడీపీ దక్కించుకుంది. నియోజకవర్గ కేంద్రమైన సూళ్లూరుపేట మండల ఎన్నిక వాయిదా పడింది. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నాలుగు వైఎస్సార్‌సీపీ, మూడు టీడీపీ దక్కించుకోగా కొండాపురం మండల ఎన్నిక శనివారం జరగనుంది. వెంకటగిరిలోని ఆరు మండలాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ చెరో మూడు చోట్ల గెలుపొందాయి. నెల్లూరు రూరల్ మండలంలో ఎంపీపీగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కలిగిరమ్మను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆమెకు వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీ కూడా ఓటు వేశారు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement