సాక్షి, నెల్లూరు: విభజనపై ‘రాష్ట్రపతి వర్తమానాన్ని’ రాష్ట్రానికి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన జిల్లా బంద్ విజయవంతమైంది. ఎన్జీఓలు, సమైక్యవాదులు, వివిధ పార్టీల నేతలు కూడా ర్యాలీలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. బంద్ పిలుపుతో దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు. తెరిచివుంచిన దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను సమైక్యవాదులు మూయించా రు.
రాస్తారోకోలు, ర్యాలీలు, రహదారుల దిగ్బంధనం తో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో పర్యటించి బంద్‌ను పర్యవేక్షించారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి ని యోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలంలో బంద్ నిర్వహించారు. పొదలకూరులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఎన్జీఓలు, సమైక్యవాదుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. మర్రిపాడులో ఆయన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరుపాళెం సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు, ఎన్జీఓలు రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో దొరవారిసత్రంలో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో హైవేపై వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగులో ముంబయి రోడ్డును దిగ్బంధించారు.
ఇందుకూరుపేటలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. నెల్లూరు సిటీ సమన్వయకర్త డాక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓలు, వి ద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ, గాంధీబొమ్మ, ఆర్టీసీ, దర్గామిట్ట తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు జరిగాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగా యి.
కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తహశీల్దార్ కా ర్యాలయం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్, ఎన్జీఓ అసోసియేషన్ కావలి అధ్యక్షుడు ఆర్వీ నరసారెడ్డి తదితరులు బంద్‌ను పర్యవేక్షిం చారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సు నీల్‌కుమార్ ఆధ్వర్యంలో గూడూరులో ధర్నాలు చేశారు. బత్తిన విజయకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూడా బంద్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. చిల్లకూరులో వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి ఆధ్వర్యంలో బంద్ జరి గింది.
కార్యాలయాలు, బ్యాంకులను మూయించారు. కోట క్రాస్‌రోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. వాకాడులోని అశోక్ స్తంభం సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మండల కన్వీనర్ వీ రారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రావి రమేష్‌చౌదరి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. డక్కిలిలో విద్యార్థి జేఏసీ నిర్వహించిన బంద్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి మద్దతు ప్రకటించారు. రాపూరు మండలంలో మాజీ మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. సైదాపురంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి బంద్‌ను పర్యవేక్షించారు.
సమైక్యంగా కదిలారు
Published Sat, Jan 4 2014 3:02 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement