తహశీల్దార్ల బదిలీల వ్యవహారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, అధికార పార్టీ శాసనసభ్యులు, ముఖ్య నేతల మధ్య చిచ్చురేపింది. ఇది తీవ్రరూపం దాల్చడంతో బదిలీలు పూర్తిగా ఆగి పోతాయనే అనుమానం కలుగుతోంది.
చిత్తూరు : తహశీల్దార్ల బదిలీలు తాము చెప్పినట్లే చేయాలంటూ కొందరు అధికార పార్టీ శాసనసభ్యులు, ముఖ్యనేతలు కలెక్టర్‌పై ఒత్తిడి పెంచారు. పరిశ్రమల పేరుతో తిరుపతి, మదనపల్లె, కుప్పంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పలువురు రెవె న్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ వారి అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, కుప్పం ప్రాంతాల్లోని పలువురు తహశీల్దార్లను బదిలీ చేయకూడదంటూ అధికారపార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు.
పూతలపట్టు నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ అధికారిణి అనంతపురం జిల్లా అధికారపార్టీ శాసన సభ్యునికి సమీప బంధువు. ఆ అధికారిణిని ఆ ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయకూడదని అధికార పార్టీ నేతలు ఇప్పటికే కలెక్టర్‌కు హు కుం జారీచేసినట్లు సమాచారం.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో పనిచేసే తహశీల్దార్లు అక్కడి నుంచి బదిలీ అయ్యేందుకు అంగీకరించడం లేదు. వారంతా పచ్చ చొక్కా ప్రజాప్రతిని ధులు, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని బదిలీ చేయకూడదంటూ ఆ ప్రాంతాల అధికార పార్టీ శాసనసభ్యులు కలెక్టర్‌కు గట్టిగా చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రితో చెప్పిస్తామని బెదిరిస్తున్నా రు. వీరితోపాటు జిల్లావ్యాప్తంగా పలువురు తహశీల్దార్లు తమకు కచ్చితంగా పలానా ప్రాంతమే కావాలంటూ అధికార పార్టీ నేతల ద్వారా చెప్పించినట్లు తెలుస్తోంది.
తాత్కాలికంగా వాయిదా వేస్తారా ?
కలెక్టర్ వ్యవహర శైలిని వ్యతిరేకిస్తున్న రెవెన్యూ అధికారులు గత నెలలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలి సిందే. కలెక్టర్ తీరును నిరసిస్తూ కుప్పం లో ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో తిరుపతి, మదనపల్లె ప్రాంతాలకు చెందిన రెవెన్యూ అధికారులు కీలక భూ మికను పోషించారు. వారిపై కసితో ఉన్న కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ తాజా బదిలీల్లో వారి సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారు. కొందరిని ప్రాధాన్యంలేని మారుమూల ప్రాంతాలకు బదిలీ పేరుతో పంపేందుకు కలెక్టర్ జాబితా సైతం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఇది పసిగట్టిన రెవె న్యూ అధికారులు అందుకు విరుగుడుగా అధికార పార్టీ శాససభ్యులు, ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని బదిలీలను ఆపించుకునేందుకు కలెక్టర్‌పై ఒత్తిడి తె చ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తలబొప్పి కట్టిన సిద్ధార్థ్‌జైన్ రెవెన్యూ అధికారుల బదిలీలను వివిధ కారణాలు చూపి తాత్కాలికంగా వాయిదా వేసేం దుకు సిద్ధమైనట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారుల బదిలీ లను వాయిదా వేయనీయకుండా హైదరాబాద్ స్థాయి నుంచి కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కలెక్టర్ vs టీడీపీ
Published Sat, Sep 26 2015 5:32 AM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM
Advertisement
Advertisement