కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు: బాబు | Congress MPs like a Sonia Gandhi Pet Dogs: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు: బాబు

Published Wed, Sep 4 2013 7:08 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు: బాబు - Sakshi

కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు: బాబు

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని సోనియా గాంధీ రెండు ముక్కలు చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. మన ప్రధాన అసమర్ధ ప్రధాని... సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ఓట్లతో కోసంమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆత్మగౌరవ యాత్రలో ఆరోపించారు.

లోక్‌సభ, రాజ్యసభలో సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు. కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు అధికారం అప్పగిస్తే వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తానని మరోసారి చంద్రబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement