సాక్షి, విశాఖపట్నం : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11న ఆరిలోవ శ్రీకాంత్ నగర్‌కు చెందిన భూతల శ్రీను మహేష్(48) అనే వ్యక్తి నలుగు అంస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రోజు స్థానికులు భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాధితుడికి కరోనా సోకిన విషయం తెలియగానే శ్రీకాంత్ నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు కరోనా సోకిందనే మహేష్ ఆత్మహత్య చేసకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులకు సైతం కరోనా భయం పట్టుకుంది. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి)
Comments
Please login to add a commentAdd a comment