ఇక వైరస్‌ గుట్టు రట్టే..!  | Corona Virus Testing Using VRDL Kits In Prakasam District | Sakshi
Sakshi News home page

ఇక వైరస్‌ గుట్టు రట్టే..! 

Published Wed, May 6 2020 9:33 AM | Last Updated on Wed, May 6 2020 9:33 AM

Corona Virus Testing Using VRDL Kits In Prakasam District - Sakshi

క్లియా యంత్రం, వీఆర్‌డీఎల్‌ యంత్రం  

సాక్షి, ఒంగోలు‌: కోవిడ్‌– 19 నిర్ధారణ పరీక్షలను ఒంగోలులోనే నిర్వహిస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ జనరల్‌ వైద్యశాలలో ఆర్‌టీపీసీఆర్, క్లియా యంత్రాలతో పాటు వీఆర్‌డీఎల్‌ యంత్రంతో కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ల్యాబ్‌ కూడా సరి్టఫై కానుంది. ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఆర్‌టీ పీసీఆర్‌ రియల్‌ టైమ్‌ పాలిమిరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ టెస్టు ద్వారా కోవిడ్‌ 19ను ప్రాథమికంగా నిర్ధారణ చేయాలి. అనంతరం క్లియా యంత్రం ద్వారా చేస్తారు. పాజిటివ్‌గా తేలితేనే మరోసారి వీఆర్‌డీఎల్‌ ద్వారా నిర్ధారిస్తారు. 

మొత్తం 18 యంత్రాలు.. 
జిల్లా వ్యాప్తంగా 18 ఆర్‌టీపీసీఆర్‌ యంత్రాలున్నాయి. వీటిలో 9 యంత్రాలను ఒంగోలు ప్రభుత్వ జనరల్‌ వైద్యశాలకు తరలించారు. పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఇపీలో పని చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లను, సీహెచ్‌సీలలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్‌ టెక్నీíÙయన్లను డిప్యూటేషన్‌పై నియమించనున్నారు. అదనంగా మరో నాలుగు యంత్రాలను కూడా ప్రభుత్వం అందించింది. అలాగే కందుకూరులో 3, మార్కాపురంలో 4, చీరాలలో 3 యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు 500 శాంపిల్స్‌ పరీక్షించే వీలుంటుంది. ఈ శాంపిల్స్‌ను ఎక్కడికక్కడ ఐసీఎంఆర్, ఎంఎఎస్‌ఎస్‌ పోర్టల్స్‌లో ఏ రోజుకు ఆ రోజు నమోదు చేస్తారు. క్లియా ద్వారా ఒక సారి 1000 వరకూ టెస్టులు చేస్తారు.  

వీఆర్‌డీఎల్‌.. 
కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్ష వీఆర్‌డీఎల్‌ ద్వారా నిర్వహిస్తారు. పాజిటివ్‌ వచ్చిన శాంపిల్స్‌కు సంబంధించిన స్వాబ్‌లను సేకరించి ఈ యంత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. వీఆర్‌డీఎల్‌ యంత్రం ద్వారా చేసే పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈయంత్రంను ఒంగోలుకు సరఫరా చేసింది. దీనిని ఐసీఎంఆర్‌ సరి్టఫై చేయాల్సి ఉంది.  

సిబ్బంది భద్రత కోసం.. 
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు చికిత్సను అందించే వైద్యులకు, వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఒంగోలు ప్రభుత్వ జనరల్‌ వైద్యశాలలో ప్రభుత్వం కియోస్‌్కలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా అనుమానితుని నుంచి శాంపిల్స్‌ను సేకరించే సమయంలో వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ ఉంటుంది. ఒంగోలు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కియోస్‌్కలకు ఒక వైపు అద్దం ఉంటుంది. ఈ అద్దంలో నుంచి రెండు రబ్బర్‌ గ్లౌజ్‌లు బయటకు వస్తాయి. కరోనా అనుమానితుడు బయట ఉంటాడు. వైద్యుడు కియోస్క్‌ లోపల ఉంటారు.

వైద్యులు రబ్బరు గ్లౌజులు ధరించి అనుమానితుల నుంచి నమూనాలను సేకరిస్తారు. అనంతరం నమూనాలను మైనస్‌ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి పరీక్షలకు కోసం ల్యాబ్‌లకు పంపిస్తారు. సాధారణంగా గొంతు నుంచి నమూనాలు సేకరించే సమయంలో రోగికి వాంతులు కావడంతో పాటు తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వైద్యులకు సులభంగా వైరస్‌ సొకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కియోస్క్‌ల ద్వారా ఇలాంటి ప్రమాదం తప్పుతుంది. నమూనా సేకరణ పూర్తి అయ్యాక ఆ కియోస్‌్కను, కియోస్క్‌ ఉన్న గదిని శానిటైజ్‌ చేసి, సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేస్తారు. ఒంగోలు జీజీహెచ్‌లో మూడు కియోస్‌్కలను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement