సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 వేలు దాటింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22,371 నమూనాలు పరీక్షించగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మందికి, విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా సోకిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8452 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 101కి చేరింది. తాజాగా 138 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4111 కు చేరింది. ప్రస్తుతం 4240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment