సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్ సమయంలో, సడలించాక కరోనా కేసుల పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. మొత్తం నాలుగు దఫాలుగా లాక్‌డౌన్ కొనసాగించగా, లాక్‌డౌన్ సడలింపు తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు తేల్చింది. మార్చి 24కు ముందు కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. పూర్తిగా లాక్‌డౌన్ సడలించాక అంటే గడిచిన 20 రోజుల్లోనే 4776 కేసులు నమోదైనట్టు తేల్చింది. దీంతో ప్రజల్లో స్వీయ నియంత్రణ లేదని స్పష్టమవుతోందని, వారు జాగ్రత్తలు పాటిస్తే కేసులను నియంత్రించొచ్చని అంటున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం
ఒకే రోజు 22,371పరీక్షలు
6,52,377కి చేరిన మొత్తం టెస్టుల సంఖ్య
కొత్తగా 206 మంది డిశ్చార్జి
కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 22,371 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ఒకేరోజులో పెద్ద సంఖ్యలో టెస్టులు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ పరీక్షల్లో 491 మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 6,52,377 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,452గా ఉంది. కొత్తగా 206 మంది డిశ్చార్జి కావడం ద్వారా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,111కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మరో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 101 కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,240గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment