సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వ వైద్యసిబ్బందితోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వారిని కూడా ప్రభుత్వం అత్యవసర సర్వీసుల చట్టం(ఎస్మా) పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులెవరైనా విధులకు హాజరు కావాల్సిందే. నేటి నుంచి ఆరు నెలల పాటు ఎస్మా అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అత్యవసర సేవల చట్టం (ఎస్మా) పరిధిలోకి వచ్చేవాళ్లు వీరే..
► ఆరోగ్య శాఖలో పనిచేసే అన్ని సర్వీసులకు చెందిన వాళ్లు
► డాక్టర్లు, నర్సులు, హెల్త్ సిబ్బంది
► పారిశుధ్య కార్మికులు, మెడికల్ ఎక్విప్‌మెంట్, నిర్వహణ సిబ్బంది
► మందుల ఉత్పత్తి, వాటి రవాణా, అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బంది
► అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేసేవారు
► వాటర్, ఎలక్ట్రిక్ సరఫరా విభాగాల్లో పనిచేసే సిబ్బంది
► సెక్యూరిటీ సంబంధిత శాఖల్లో పనిచేసే సిబ్బంది
► ఆహారం, తాగునీరు అందించే వారు
► బయో వ్యర్థాల నిర్వీర్యం కోసం పనిచేసే సిబ్బంది
అమల్లోకి అత్యవసర సేవల చట్టం
Published Sat, Apr 4 2020 2:35 AM | Last Updated on Sat, Apr 4 2020 8:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment