సాక్షి,అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో పిల్లలను వృద్ధులకు దూరంగా ఉంచితేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 6.4 శాతం మంది 15 ఏళ్ల లోపువారే ఉండడంతో పెద్దలే జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఇలాంటి చిన్నారులకు కరోనా పాజిటివ్ అయినప్పుడు పెద్దగా లక్షణాలు కనిపించవని, దీనివల్ల ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో వచ్చిన కేసులను పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని తేల్చారు. ఈ నేపథ్యంలో పెద్దలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వారు ఏం అంటున్నారంటే...
► 15 ఏళ్లలోపు చిన్నారుల్లో కరోనా సోకినా తొందరగా లక్షణాలు కనిపించవు
► వీరు బయట తిరిగినా, అపరిచిత వ్యక్తులతో తిరిగినా మనమే వారికి నిర్ధారణ చేసి గుర్తించాలి
► వీలైనంత వరకూ వారిని బయటకు పంపించకుండా ఉండాలి
► మన రాష్ట్రంలో 37 మంది 15 ఏళ్లలోపు చిన్నారులు కరోనా పాజిటివ్‌గా నమోదయ్యారు
► వీరిలో 90% మందికి ఢిల్లీనుంచి వచ్చిన వారి ద్వారా సోకినవే
► ఇందులో పలువురు చిన్నారులు తమ గ్రాండ్ పేరెంట్స్ (అమ్మమ్మ, తాతయ్య)లకు అంటించారు
► చిన్నారులకు పాజిటివ్ వస్తే ఇంట్లోనే కోలుకోవచ్చు కానీ పెద్దవాళ్లకు సోకితే చాలా ఇబ్బందులు వస్తాయి
► చిన్నారులున్న ఇంట్లో పెద్ద వాళ్లు ప్రత్యేక గదుల్లో ఉండాలి
పెద్దలే జాగ్రత్తగా ఉండాలి
ఈ విషయంలో చిన్నారులది తప్పుకాదు. పెద్దలే జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను, వృద్ధులను వేరు వేరు గదుల్లో ఉండేలా చర్యలు తీసుకోండి.
–డా.కె.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, అదనపు సంచాలకులు, వైద్య విద్యా శాఖ
Comments
Please login to add a commentAdd a comment