ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో తొలి కరోనా మృతి నమోదైంది. కరోనా పాజిటివ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్ డాక్టర్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.అలాగే సోమవారం జిల్లాలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. నగరంలోని చంద్రబాబునగర్, రంగనాయకులపేట, ఖుద్దూస్‌నగర్, తడ మండలంలోని బీవీపాళెంలో కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీ నుంచి మతప్రచారం నిమిత్తం నగరానికి వచ్చి ఖుద్దూస్‌నగర్‌లోని మసీదులో ఉంటున్న వ్యక్తిని గుర్తించి అధికారులు క్వారంటైన్‌కు తరలించగా అతనికి పాజిటివ్ వచ్చింది.
ఇదిలా ఉండగా తడ బీవీపాళెంలో తండ్రి నుంచి మూడో బిడ్డకు కరోనా సోకింది. కొత్తగా నమోదైన నాలుగు పాజిటివ్ కేసులు ఢిల్లీతో సంబంధం ఉన్నవే కావడం విశేషం. ఈ నలుగురితో కలిపి మొత్తం 56 మందికి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైద్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పెద్ద ఎత్తున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. డాక్టర్ మృతికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా. ఎస్‌వీకే ప్రసాద్‌రెడ్డి, డా. పి. ఫణిదర్‌రెడ్డి, నగర్ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డా. ఎంఏవీవీ ప్రసాద్, గోపాలకృష్ణయ్య సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment