సాక్షి, అమరావతి: స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చే స్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్‌లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది.
- ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు
- వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారు.
- విశాఖపట్నంలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ విధానం చాలా బావుంది
- అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ చక్కగా పనిచేస్తోంది
- కాకినాడలో 24 గంటల హెల్ప్ డెస్క్‌లు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు
- అమరావతిలో పబ్లిక్ అవేర్‌నెస్ బ్యానర్‌లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారు.
కరోనా నియంత్రణ చర్యలు చాలా 'స్మార్ట్'!
Published Mon, Mar 30 2020 3:53 AM | Last Updated on Mon, Mar 30 2020 3:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment