శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్ ప్రయోగానికి ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఉదయం 11.50 గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్ ప్రక్రియ 29 గంటలపాటు కొనసాగుతుంది.
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్ ప్రయోగానికి ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఉదయం 11.50 గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్ ప్రక్రియ 29 గంటలపాటు కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. భూ సమాంతర కక్ష్యలో జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్ ను రూపొందించింది. మొదటి ప్రయోగం విఫలం కావడంతో రెండోసారి చేస్తున్న ఈ ప్రయోగంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రెండేళ్ల నుంచి 37 రకాల పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే లాంచ్ రిహా ర్సల్స్ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ.. ఇంకా కొన్ని అనుమానాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.