ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎర్రదండు కదంతొక్కింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి కుంభకోణాలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
కలెక్టరేట్, న్యూస్‌లైన్
ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎర్రదండు కదంతొక్కింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి కుంభకోణా లు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వారిని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలను
ప్రతిఘటించాలి : పల్లా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి, పేదలకు భూములను పంచాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, రే షన్‌కార్డులిచ్చి, చౌకధరల దుకాణాల ద్వారా ప్ర తి ఒక్కరికీ 35 కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీతో పాటు జిల్లాకు నీరందించే ప్రాజెక్టులను యుద్ధప్రాదిపదికన పూర్తి చేయాలన్నా రు. సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి, ప్రాణహిత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ పేద ప్రజలపై ధరల భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే మునుగోడు నియోజకవర్గంలో పూర్తిస్థా యి కృష్ణాజలాలు అందడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనె వెంకటస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, ఎల్.శ్రావణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, కె.కాంతయ్య, వి.సృజన, పద్మ, నెల్లికంటి సత్యం, రాజారాం, రాజు, ఆర్.అచారి, పబ్బు వీరస్వామి పాల్గొన్నారు.