ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు విస్మరించారని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు.
నెల్లూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు విస్మరించారని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని నారాయణ విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించటం సరికాదన్నారు.