'దమ్ముంటే దీపక్‌రెడ్డిని సస్పెండ్ చేయండి'
Published Wed, Jun 14 2017 1:16 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
విజయవాడ: చంద్రబాబు నాయుడికి దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భూ కుంభకోణంలో కూరుకుపోయి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న దీపక్ రెడ్డి విషయం బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
విశాఖ జిల్లాలో జరిగిన భూదందాను డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్‌లు నిర్ధరించారు. ఈ అంశంపై సమస్యను పక్కదోవ పట్టించి దోషులను కాపాడేందుకే చంద్రబాబు సీట్ విచారణ అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ మాఫియాగా మారింది. ప్రతి అక్రమం వెనుక టీడీపీ నేతలే సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement