
‘విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారు’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సింగరావు విమర్శించారు. ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో పాల్గొన్న పాల్గొన్న ఆయన.. దేశంలోనే అతిపెద్ద భూస్కాం విశాఖలో జరిగిందన్నారు.
లక్షలాది ఎకరాల భూములను తెలుగుదేశం పార్టీ నేతలు లాక్కున్నారని నర్సింగరావు మండిపడ్డారు. పేదల భూములను కొల్లగొట్టినవారికి బేడీలు వేయాలన్నారు. ఓ వైపు బీజేపీ ఎంపీ విష్ణుకుమార్ రాజు కబ్జాల గురించి మాట్లాడుతుంటే.. విశాఖ ఎంపీ హరిబాబు మాత్రం మాట్లాడటం లేదని నర్సింగరావు విమర్శించారు. అధికారపార్టీ నేతల భూకబ్జాలపై అన్ని పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు
బీఎస్పీ నేత బంగారి మాట్లాడుతూ.. చంద్రబాబు విశాఖను అత్తారిల్లులా వాడుకుంటున్నారని విమర్శించారు. పేదలు, బడుగులతో పాటు.. మాజీ సైనికుల భూములను సైతం వదలకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేశారని అన్నారు. ఎవరి భూములు వారికి దక్కేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.