
ఏపీలో అరాచకపాలన : బొత్స
పశ్చిమ గోదావరి :
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలనకు ప్రజలే చరమగీతం పాడతారని ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు.
పోలవరం పేరుతో చంద్రబాబు అండ్ కో కోట్ల రూపాయలు దోచుకుందని బొత్స నిప్పులు చెరిగారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే విశాఖపట్నం భూ కుంభకోణం జరిగిందన్నారు.