విశాఖపట్నం కంబాలకొండ రిజర్వ్ ఫారెస్టులోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌ను తరలించవద్దంటూ సీపీఎం నాయకులు విశాఖ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు.
విశాఖపట్నం : విశాఖపట్నం కంబాలకొండ రిజర్వ్ ఫారెస్టులోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌ను తరలించవద్దంటూ సీపీఎం నాయకులు విశాఖ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు. జూ పార్కు ఉన్న ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలనే ఆలోచనతో ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు కొన్ని రోజుల కిందట పరిశీలించారు.
ఈ నేపథ్యంలోనే.. జూపార్కును తరలిస్తున్నారనే ఊహాగానాలు వెలువడటంతో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. సుమారు 625 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును 1977లో ఏర్పాటు చేశారు.