ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధంగానే ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాటపట్టింది.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధంగానే ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాటపట్టింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. కార్యకర్తలతో కలిసి సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీల అభివృద్ధికి ఎస్టీల మాదిరిగా ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ప్రత్యేకంగా 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అటు ఖమ్మం కలెక్టరేట్ వద్ద కూడా సీపీఎం ధర్నా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు ధర్నాలో పాల్గొన్నారు.