శ్రీవారి దర్శనానికి 24 గంటలు
సాక్షి, తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పోటెత్తింది. రంజాన్, రెండో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావటంతో భక్తులు తిరుమల బాట పట్టారు. శుక్రవారం సా. 6 గంటలకు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండారు. సర్వదర్శనానికి రెండు కిలోమీటర్లు మేర క్యూలో భక్తులు వేచిఉన్నారు. వీరికి 24 గంటలు సమయం పడుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులు మరో 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెలుపల ఉన్న నారాయణగిరి ఉద్యానవనంలో కాలిబాట భక్తుల క్యూ నిండిపోయింది. వీరికి 10 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల భక్తుల క్యూలో కేవలం 15వేల మందిని మాత్రమే అనుమతించి మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేశారు. తలనీలాలు ఇచ్చేందుకు కూడా భక్తులు అష్టకష్టాలు పడ్డారు.
తిరుమలలో పోటెత్తిన భక్తులు
Published Sat, Aug 10 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement