తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి సర్వదర్శనం కోసం 2 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కాలినడకన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా, ఆదివారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 51,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.