సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, సిబ్బం ది, అప్పుల పంపిణీపై చర్చించేందుకు ఈ నెల 6న సమావేశమవ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం అవసరం లేని సంస్థల ఆస్తులు, అప్పులు, సిబ్బందిని తెలంగాణకు వదిలేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సమావేశంలో సమీక్షించనున్నారు.
కాగా 9వ షెడ్యూల్‌లోని ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులను స్థానికత ఆధారంగానే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్థానికత ఆధారంగా అయితే ఆంధ్రాకు ఎక్కువమంది ఉద్యోగులు వస్తే ఆర్థిక భారం పడుతుందని, దీనికి అంగీకరించబోమని పేర్కొంటోంది.