కరెంటు కుంభకోణం | Current scandal | Sakshi
Sakshi News home page

కరెంటు కుంభకోణం

Published Tue, Oct 27 2015 1:46 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

కరెంటు కుంభకోణం - Sakshi

కరెంటు కుంభకోణం

దేవస్థానం విద్యుత్‌ను  రూ.లక్షల్లో వాడేస్తున్న షాపుల యజమానులు
 ఏడాదికి రూ.1.20 కోట్ల విద్యుత్ చార్జీల చెల్లింపు
షాపుల అద్దెకన్నా కరెంటు చార్జీల మోతే ఎక్కువ
కమీషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోని అధికారులు
దశాబ్దాలుగా సాగుతున్న దోపిడీ

 
అక్రమాలకు ఆలవాలంగా మారిన శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. పట్టించుకునే నాథుడు లేక పోవడంతో కమీషన్లకు అలవాటు పడ్డ సిబ్బంది వచ్చినకాడికి దండుకుంటూ స్వామి సొమ్మును కైంకర్యం చేస్తున్నారు. తాజాగా ఆలయంలో ఏళ్లతరబడి సాగుతున్న విద్యుత్ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దేవస్థానానికి భక్తుల ద్వారా వచ్చే సొమ్మే ప్రధానమైన ఆదాయు వనరు. అరుుతే  ఆలయూధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి ఆలయ ఆదాయూనికి  భారీగా గండికొడుతున్నారు. తాజాగా విద్యు త్ దోపిడీ వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తి దేవస్థానం వారు నెలకు రూ.10లక్షల నుంచి 11లక్షలు వరకు విద్యుత్‌శాఖకు కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఏడాదికి రూ.1.2 కోట్లకుపై వూటే. అరుుతే ఆలయు ఆవరణలో 55 షాపులున్నారుు. దేవస్థానం టెండర్ల ద్వారా ఆ షాపులను పలువురు వ్యాపారులకు ఇచ్చారు. వారంతా నెలనెలా ఆలయూనికి అద్దె చెల్లించాలి. ప్రత్యేక మీటర్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ చార్జీలు భరించాలి. అరుుతే వీరంతా దేవస్థానం విద్యుత్‌ను ఏళ్ల తరబడి వినియోగిస్తున్నారు. ఆలయూనికి వారు తవు షాపునకు చెల్లించే అద్దెకన్నా ఆలయు విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్నట్లు తేల్చేచారు. అరుునా ఏళ్ల తరబడి. పోతేపోని...వునకేం నష్టం.. భక్తులు ఇచ్చే ఆలయు సొమ్మేకదా అంటూ ఇటు దేవస్థానం అధికారులు, అటు విద్యుత్‌శాఖ అధికారు లు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో దేవస్థానాని కి నెలకు రూ.10 నుంచి 11 లక్షలు విద్యుత్ చార్జిలు చెల్లిస్తోందంటే  భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దేవస్థానానికి చెందిన సన్నిధివీధిలోని టూరిస్ట్ బస్డాండ్‌లో కొందరు కాంట్రాక్టర్లు ఆలయు విద్యుత్‌ను లక్ష రూపాయల్లో వినియోగిస్తున్నారు. ఇంకొందరు ఎం చెక్కా దేవస్థానం కరెంట్‌తో విద్యుత్ వీటర్లు పెట్టి వేడినీళ్లను యూత్రికులకు బక్కెట్ల రూపంలో విక్రరుుస్తు ధనార్జనకు పాల్పడుతున్నారు.ఈ విద్యుత్ దోపిడీ ఆల యూధికారులకు విద్యుత్ శాఖాధికారులకు తెలిసిందే. అరుునా వారు 10 శాతం కమీషన్లకు కక్కూర్తి పడి పట్టించుకోవడం వూనేశారనే వివుర్శలున్నారుు. కాగా ఆలయు విద్యుత్ దోపిడీపై రెండురోజుల క్రితం ఈవో భ్రవురాంబ దృష్టికి ఆలయు బోర్డు సభ్యుడు అత్తింజేరి బాలాజీ తీసుకువెళ్లారు. దీంతో ఆమె దోపిడీని నిగ్గుతేల్చేందుకు ఆలయు బోర్డు సభ్యుడు అత్తింజేరి బాలాజీతోపాటు రెండురోజులుగా షాపులను తనిఖీ చేశారు.దేవస్థానం విద్యుత్‌ను ఎలా వినియోగిస్తారంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులను ఆదేశించారు. అరుుతే టెం డర్లు ద్వారా షాపులు ఇస్తున్న నేపథ్యంలో వురోసారి టెండర్లు నిర్వహిస్తే తవుకే షాపులు వస్తాయూ? అని వారు ప్రశ్నించారు. అలా రాకుంటే  ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం కావడంతో ఈవో పేరిట మీటర్లు ఏర్పాటు చేయునున్నారు. ఈ మేరకు విద్యుత్‌శాఖ ఏడీఏ సుబ్రవుణ్యంతో సోవువారం ఈవో భ్రవురాంబ, ఆలయు బోర్డు సభ్యుడు అత్తింజేరి బాలాజీ చర్చలు సాగించారు. వెంటనే మీటర్లు వుంజూరు చేయూలని సూచించారు.

రూ.లక్షల్లో విద్యుత్ దోపిడీ : ఈవో
ఈ విషయుంపై ఆలయు ఈవో భ్రవురాంబను ఫోన్‌లో వివరణ కోరగా ఈ విషయుం ఇంతలోనే మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. విద్యుత్‌శాఖ వాళ్లతో సవూవేశమైన ఫొటోలు ఎవరు ఇచ్చారు? అంటూనే దానిపై పూర్తి వివరాలు ఆలయు గౌరవసభ్యుడు అత్తింజేరి బాలాజీ వివరిస్తారంటూ మిన్నకుండిపోయారు. దీంతో బోర్డు సభ్యుడు వూట్లాడుతూ దేవస్థానానికి చెందిన విద్యుత్‌ను లక్షల రూపారుుల్లో షాపుల వాళ్లు వాడుకున్నారని తెలిపారు. దేవస్థానానికి చెందిన కొందరు అధికారులు, విద్యుత్‌శాఖకు చెందిన వురికొందరు అధికారులు కువ్ముకై కమీషన్లకు పాల్పడి ఈ దోపిడీ చేశారని తేల్చిచెప్పారు.
 
 55 మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం
దేవస్థానం ఆవరణలోని 55 షాపులకు ఈవో భ్రవురాంబ పేరిట 55 మీటర్లు ఏర్పాటు చేయునున్నాం.  దేవస్థానం ఈవో విద్యుత్‌పై సోవువారం చర్చించారు. నెలకు రూ.10 లక్షల నుంచి 11 లక్షలు దేవస్థానం వూ శాఖకు చెల్లిస్తోందని ఈవోవివరించారు. దీంతో ఆమె షాపులకు 55 మీటర్లు ఏర్పాటు చేయూలని చెప్పారు.
 - సుబ్రవుణ్యం, విద్యుత్‌శాఖ ఏడీఏ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement