'లెహర్ తుఫాన్ బలహీనపడుతోంది' | Cyclone Lehar weakens into a deep depression | Sakshi
Sakshi News home page

'లెహర్ తుఫాన్ బలహీనపడుతోంది'

Published Wed, Nov 27 2013 7:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

Cyclone Lehar weakens into a deep depression

'లెహర్‌' తుఫాన్ క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ, జిల్లా అధికారులు తెలిపారు. పెను తుఫాన్‌గా మారిన లెహర్ బలహీనపడి తీరం దాటే అవకాశం ఉంది అని అధికారులు స్పష్టం చేశారు. తీరందాటే సమయంలో 80-100 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
 
పశ్చిమవాయవ్య దిశగా పయనిస్తున్న తుఫాన్..తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురియవచ్చని అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నంకు 520  కి.మీ. దూరంలో,  కాకినాడకు 470 కి.మీ దూరంలో తుపాను కేంద్రికృతమైవుందని తెలిపారు.  రేపు మధ్యాహ్నం తర్వాత మచిలీపట్నం వద్ద  తుపాను తీరం దాటనుందని  అధికారులు చెప్పారు. 
 
తుఫాన్ ప్రభావం 53వేల మందిపై ఉందని, సుమారు 55 గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలు బందరు, నాగాయలంక, అవనిగడ్డ,  కోడూరు, కృత్తివెన్ను, మోపీదేవి, బంటుమిల్లి పై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు వివరించారు. 
 
సహాయ సమాచారం కోసం వివిధ ప్రాంతాల్లో  హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కింద తెలిపిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 
 
విజయవాడ: 0866-2575038,2767075
గూడూరు: 08624-251827
నెల్లూరు: 0861-2345863,2345864
ఒంగోలు: 08592-280202,280203
రాజమండ్రి: 0883-2420541,2420780
ఏలూరు: 08812-226401
తాడేపల్లిగూడెం: 08818-226162
తుని: 08854-252172
అనకాపల్లి: 08924-221698

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement