ఆంధ్రప్రదేశ్కు హుదూద్ తుపాన్ ముప్పు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తుపాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో తుపాన్ ఏర్పడింది. వాయుగుండం తుపాన్గా మారినట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి హుదూద్గా నామకరణం చేశారు.
తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 24 గంటల్లో తీవ్ర తుపాన్గా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండవచ్చని హెచ్చరించారు. అండమాన్ పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది.