దళిత ద్రోహి చంద్రబాబు: మేరుగ | Dalit mole Naidu: meruga | Sakshi
Sakshi News home page

దళిత ద్రోహి చంద్రబాబు: మేరుగ

Published Mon, Apr 6 2015 2:41 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

దళిత ద్రోహి చంద్రబాబు: మేరుగ - Sakshi

దళిత ద్రోహి చంద్రబాబు: మేరుగ

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదినెలల పాలనలో దళితులకు తీరని ద్రోహం చేశారని, వారికి కేటాయించిన నిధుల్లో భారీగా కోతలు విధించారని వైఎస్సార్ సీపీ ధ్వజమెత్తింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పాలనలో నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు తీరు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్నే అపహాస్యం చేసే విధంగా తయారైందన్నారు.

గత ఏడాది రూ.1.11 లక్షల కోట్ల పరిమాణం గల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వాస్తవానికి 1,12,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సవరించిన అంచనాల్లో చూపారని చెప్పారు. అందులో కేవలం 23 శాతం నిధులను మాత్రమే ప్లాన్ బడ్జెట్‌కు కేటాయించారన్నారు. గత పదేళ్ల సగటును తీసుకుంటే ప్లాన్ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచి 35 శాతం వరకు ఉందని, అది ఒక్కో సంవత్సరంలో 38 శాతం వరకు ఇచ్చిన సందర్భాలున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఎక్కువ నిధులు వెళ్లకూడదనే కుట్రతోనే చంద్రబాబు తన తొలి బడ్జెట్‌లో ప్లాన్ బడ్జెట్‌కు 23 శాతం నిధులే కేటాయించారని విమర్శించారు.

సబ్‌ప్లాన్ చట్టం లేని రోజుల్లో కూడా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి క్రమంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా దామాషాలో నిధులు కేటాయించారని, ఇప్పుడు చట్టం ఉండి కూడా చంద్రబాబు సబ్‌ప్లాన్‌కు ఎక్కువ నిధులు పోకుండా ఏకంగా ప్రణాళికా వ్యయాన్నే తగ్గించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయనపై దుమ్మెత్తి పోయడానికి ముందుకొచ్చే దళిత మంత్రులు సబ్‌ప్లాన్ నిధులు ఎందుకు తగ్గించారని సీఎం చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement