
శ్రీ మహిషాసురమర్దనీదేవి
అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని , విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ...
శరన్నవ రాత్రి మహోత్సవాల్లో తొమ్మిదో రోజైన బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దనిదేవీగా అలంకరిస్తారు. చండీసప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో, దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణనాతీతం.
మహిషాసురమర్దని దేవిని దర్శించుకున్న భక్తులకు శత్రుబాధ తొలగిపోవడమే కాక దుష్ట గ్రహ బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.- విజయవాడ (ఇంద్రకీలాద్రి)