కరీంనగర్: మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కిరణ్ నిర్ణయానికి నిరసనగా నేడు కరీంనగర్ జిల్లా బంద్కు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.
ఈ సందర్భంగా డీసీసీ రవీందర్రావు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబుకు పాత శాఖనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, తెలంగాణ మంత్రిని శాఖనుంచి తప్పించటం సరికాదన్నారు. బంద్ను విజయవంతం చేయాలని కోరారు.