రాజధాని సీమలో ఏర్పాటు చేయాలి
కడప కలెక్టరేట్: రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ రాజధాని సాధన సమితి కార్యకర్తలు బుధవారం ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఎం.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయన్నారు. 1956కు ముందున్న మాదిరి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించారని.. దీంతో ముఖ్యంగా రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు 1956కు ముందున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమకు ఇవ్వడమే న్యాయమన్నారు. సుసంపన్నమైన కోస్తా ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి రాజకీయ నాయకులు పావులు కదపడం అభ్యం తరకరమన్నారు. రాజధాని రాయలసీమ హక్కు అని, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాయలసీమ వాసులైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వెనుకబడ్డ ‘సీమ’లో రాజధాని ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతిపత్రమిచ్చారు.