RTC bustand
-
TSRTC: ఆర్టీసీకి ఐదు కొత్త బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఆర్టీసీ కొత్త బస్టాండ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లు పాతబడిపోయాయి. పైకప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కనీసం 40 వరకు బస్టాండ్లను పునర్నిర్మించాల్సి ఉంది. కానీ నిధుల సమస్యతో దశలవారీగా బస్టాండ్లను పునర్నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు కొత్త బస్టాండ్ల నిర్మా ణం చేపట్టాలని భావిస్తోంది. ఇటీవలే ఖమ్మంలో పాత బస్టాండును అలాగే ఉంచి నగర శివారులో కొత్త బస్టాండును ఆర్టీసీ సొంత నిధులతో నిర్మించింది. తాజాగా సిద్దిపేటలోని పాత బస్టాండును కూల్చేసి దాని స్థానంలో రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులతో కొత్త బస్టాండు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అలాగే పాతబడి పెచ్చులూడుతున్న దుబ్బాక, గద్వాల పట్టణ బస్టాండు భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఇందుకు మొత్తంగా రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులను ప్రభుత్వ నిధులతోనే చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పునర్నిర్మించినందున అక్కడికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఉన్న బస్టాండు ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకోసం సేవలందించేందుకు అనువుగా లేదు. దేవాలయ విస్తరణలో భాగంగా బస్టాండు స్థలాన్ని ప్రభుత్వం ఆలయం కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో కొత్త బస్టాం డు కోసం పట్టణం వెలుపల స్థలాన్ని కేటాయించింది. అక్కడ దాదాపు 10 ప్లాట్‌ఫామ్‌లతో కొత్త బస్టాండును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ప్రభుత్వమే నిధులు సమకూర్చనుంది. కోస్గిలో విస్తరణ.. ఇక ఇరుకుగా మారి ఏమాత్రం యోగ్యంగా లేకపోవటంతో నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బస్టాండును విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఆనుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు కోటి రూపాయల వ్యయం కానుంది. ఈ మొత్తంలో సగం నిధులను ప్రభుత్వం ఇవ్వనుండగా, మిగతా సగం మొత్తాన్ని ఆర్టీసీ భరించనుంది. ఆదిలాబాద్ పట్టణ బస్టాండు కూడా అనుకూలంగా లేదు. ఇక్కడ బస్సులు నిలిపేందుకు ప్లాట్‌ఫామ్స్ సరిపోవడం లేదు. దీంతో దాదాపు రూ.85 లక్షల వ్యయంతో అక్కడ కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తున్నారు. -
మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం
దుత్తలూరు: విజయవాడలో విలేకరుల సమావేశానికి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్ట్‌లతో ఎస్సీవర్గీకరణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యద్దనపూడి రమణయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి గొల్లపల్లి మోహన్‌రావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఇలారి దేవదాసు, మండల ఇన్చార్జి కే మనోజ్, ప్రధాన కార్యదర్శి విజయ్, బొజ్జా వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన కావలి అర్బన్: మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెం టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాస్ట్ర నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కిలగుంట మార్టిన్ సుధాకర్ మాదిగ, మంద వెంకటేశ్వర్లు మాదిగ, చేవూరు మాల్యాద్రి మాదిగ, ఎలికా చంద్రశేఖర్ మాదిగ, మహేంద్ర మాదిగ, చంద్రశేఖర్, మోజెస్, తదితరులు పాల్గొన్నారు. -
వేలం వెనుక మతలబు!
► పశు వైద్యశాల స్థల విక్రయ పంచాయితీ ► టీడీపీలో మళ్లీ నేతల మధ్య వివాదం ► భూమా నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ► ఇదే బాటలో అన్ని పార్టీల నేతలు ► అధికారులు కూడా ససేమిరా.. ► ముఖ్యమంత్రిని కలిసే యోచనలో శిల్పా. టీడీపీలో మళ్లీ చిచ్చు రగులుతోంది. ముఖ్యమంత్రి పిలిచి సయోధ్య కుదిర్చినా.. ఏదో ఒక రూపంలో నేతల మధ్య వివాదం బయటపడుతోంది. తాజాగా పశు వైద్యశాల స్థల విక్రయం వివాదాస్పదమవుతోంది. భూమా దూకుడును.. శిల్పా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పార్కింగ్ స్థలం చేద్దామన్న నేత.. ఇప్పుడు విక్రయానికి సిద్ధపడటం స్థానికుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. సొంత పార్టీతో పాటు మిత్ర పక్షం.. వామపక్షాలు కూడా ఈ విషయంలో భూమా నిర్ణయంపై భగ్గుమంటున్నారు. నంద్యాల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న పశు వైద్యశాల స్థలం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారుతోంది. ఒకరు అమ్మేద్దామంటే.. మరొకరు వద్దని వారించడం కొత్త సమస్యను తెరమీదకు తీసుకొస్తోంది. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం 2.50 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ వైద్యశాల నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల రైతులకు చెందిన పశువులకు సేవలందిస్తోంది. ఆసుపత్రి చుట్టూ ఆర్టీసీ బస్టాండ్.. షాపింగ్ కాంప్లెక్స్.. లాడ్జీలు.. పెట్రోల్ బంకులు.. బ్యాంకులు ఏర్పాటు కావడంతో ఇక్కడి స్థలానికి డిమాండ్ పెరిగింది. పశు సంవర్ధక శాఖ అధికారుల అంచనా రూ.10 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్లో రూ.25 కోట్లకు పైమాటే. గత ఏడాది రూ.కోటితో డివిజన్ స్థాయి పశు సంవర్ధక శాఖ కార్యాలయంతో పాటు శిక్షణ కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమైంది. మిగిలిన 1.30 ఎకరాల ఖాళీ స్థలం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో స్థలాన్ని బహిరంగ వేలంలో విక్రయించి.. ఆ డబ్బును అభివృద్ధికి ఉపయోగిద్దామంటూ ప్రభుత్వానికి ఈ నెల 23న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి లేఖ రాశారు. అయితే గతంలో ఆయన ఈ స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించాలని వాదించారు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్ల పైనున్న ఆటోలను ఇక్కడ పార్కింగ్ చేయిస్తే ట్రాఫిక్ సమస్యకు కాస్తయినా పరిష్కారం లభిస్తుందని చెప్పిన ఆయన పార్టీతో పార్టీ స్వరం కూడా మార్చేయడం స్థానికుల్లో చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే లేఖను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈనెల 24న జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులకు పంపి నివేదిక కోరగా.. ఆ నిర్ణయం సరికాదంటూ వ్యతిరేకించినట్లు సమాచారం. విక్రయం వద్దే వద్దు పశు వైద్యశాల విక్రయ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, వాపక్షాలు, మేధావుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పశువైద్యశాలను పట్టణానికి దూరంగా ఉన్న వైఎస్ నగర్‌కు తరలిస్తే.. రైతులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వం బహిరంగ వేలంలో స్థలాన్ని విక్రయానికి ఉంచితే.. బడా నేతలు చేతులు కలిపి కారుచౌకగా సొంతం చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బేరసారాలు.. బెదిరింపులు మామూలే. అందువల్ల ఎంతో విలువైన స్థలాన్ని విక్రయించే ప్రతిపాదన వద్దే వద్దని బీజేపీ మాజీ కౌన్సిలర్ మేడా మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఊకొట్టు వాసు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి, సీపీఐ పట్టణ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, రోడ్ల విస్తరణ పోరాట సమితి కన్వీనర్ శంకరయ్య తదితరులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి.. ఎమ్మెల్యే భూమా ప్రతిపాదనను పార్టీలోని ప్రత్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలని, ఆస్తులను అమ్మడం సరికాదని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. స్థల విక్రయానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నందున.. నేరుగా చంద్రబాబు నాయుడునే కలిసి అభ్యంతరం తెలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అభ్యంతరం ఎందుకంటే.. భవిష్యత్‌లో నంద్యాల జిల్లాగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పశువైద్యల శాల స్థలాన్ని డిమాండ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ రూ.25 కోట్లకు పైమాటే. భూమా ప్రతిపాదన మేరకు.. స్థలానికి బహిరంగ వేలం నిర్వహిస్తే అనుకూలురు దక్కించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీ కాకుండా నేతలు రంగంలోకి దిగితే.. స్థలం రూ.5 కోట్లకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదనేది జగమెరిగిన సత్యం. -
ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు గండి
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్ బస్సులుంటే.. ఉపేక్షించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు చేపడతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్న మాటలు నీటిపై రాతలుగా మారుతున్నాయి. నిత్యం బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ బస్సులు దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ దోపిడీకి అంతులేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే... నగరంలోని ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచక పోవడం వల్ల నిత్యం వందలాది ప్రైవేటు వాహనాలు నగరం నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నగరంలో 250కి పైగా ట్రావెల్స్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో 30 ట్రావెల్స్ వరకు ఆర్టీసీ బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ టిక్కెట్ ధరల కంటే ప్రైవేటు వాహనాలు అధిక ధర వసూలు చేస్తున్నా ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో తరలి వెళ్తున్నారు. రోజూ 200కు పైగా బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నడుస్తున్నాయి. తద్వారా ఆర్టీసీకి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుటే ప్రయాణికులను ఎక్కించుకువెళ్లడం మామూలైపోయింది. రాత్రి సమయంలో ట్రావెల్స్ వాహనదారులు బస్టాండ్‌లోకి వెళ్లి మరీ పలు ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులను ఎక్కించుకెళ్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ‘‘డబ్బుల్’’ ధ మాకా.... ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు బస్టాండ్‌కు వచ్చి సమయానికి బస్సు లేకపోవడమో, ఉన్నా సీట్లు లేకపోవడమో జరిగితే ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ వాహనాల్లో ఆర్టీసీ టిక్కెట్‌తో పోలిస్తే రెట్టింపు వసూలు చేస్తున్నారని, అదేమని అడిగితే ఆ బస్సులకీ ఈ బస్సులకీ తేడా ఉంది.. ఇష్టమైతే ఎక్కండి.. లేకపోతే లేదంటూ డిమాండ్ చేస్తుంటారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్ధాయి సౌకర్యాలు లేకపోవడం ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉపేక్షించం. పూర్తి స్ధాయిలో సిబ్బందితో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్సులు నిలవకుండా చర్యలు చేపడుతున్నాం. పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి మరింత దృష్టి సారిస్తాం. రవాణా, పోలీసు శాఖ అధికారులకు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరంపై ఫిర్యాదు చేయనున్నాం. ఆర్టీసీ యూనియన్ నేతలతో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్‌కు అడ్డుకట్ట వేస్తాం. - జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం -
రాజధాని సీమలో ఏర్పాటు చేయాలి
కడప కలెక్టరేట్: రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ రాజధాని సాధన సమితి కార్యకర్తలు బుధవారం ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఎం.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయన్నారు. 1956కు ముందున్న మాదిరి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించారని.. దీంతో ముఖ్యంగా రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు 1956కు ముందున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమకు ఇవ్వడమే న్యాయమన్నారు. సుసంపన్నమైన కోస్తా ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి రాజకీయ నాయకులు పావులు కదపడం అభ్యం తరకరమన్నారు. రాజధాని రాయలసీమ హక్కు అని, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాయలసీమ వాసులైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వెనుకబడ్డ ‘సీమ’లో రాజధాని ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతిపత్రమిచ్చారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన యువకుడిని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే రక్షించారు. కిడ్నాపర్లకు బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరికి చెందిన ఆనందరెడ్డి అనే యువకుడు చికిత్స నిమిత్తం తరచూ నగరానికి వచ్చేవాడు. ఈ క్రమంలో బిందెల కాలనీకి చెందిన రాజశేఖర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆనందరెడ్డి వద్ద చాలా డబ్బుందన్న విషయాన్ని రాజశేఖర్ పసిగట్టాడు. ఆనందరెడ్డిని కిడ్నాప్ చేసి సులభంగా డబ్బు సంపాదించాలని సన్నిహితులైన పింజరి బాబు, సురేంద్ర, లక్ష్మన్నతో కలిసి పథకం రచించాడు. అందులో భాగంగా ఆనందరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కదిరి నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ02ఏఎల్ 1305)లో హైదరాబాద్‌లో బయల్దేరినట్లు ఆంజనేయులు అనే వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్నాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు బస్సు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. అప్పటికే రాజశేఖర్తోసహా నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆనందరెడ్డి ఏ సీట్లో కూర్చున్నారో గుర్తించారు. అనంతరం బస్సు బస్టాండ్ నుంచి బయటకు రాగానే ఆ నలుగురూ కారులో వెంబడించారు. రాజహంస అపార్టుమెంట్ సమీపంలోకి రాగానే బస్సును అటకాయించి ఆనందరెడ్డిని బలవంతంగా లాక్కొచ్చి కారులో తీసుకెళ్లారు. ముఖానికి ముసుగు వేసి అతడిని నగరమంతా కారులోనే తిప్పుతూ రూ.లక్ష ఇస్తే వదిలి పెడతామని, లేకుంటే కడతేరుస్తామని బెదిరించారు. బుధవారం ఉదయం శ్రీకంఠం సర్కిల్లో సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐలు జాకీర్ హుస్సేన్, ధరణీ కిశోర్‌లు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులోంచి ఆనందరెడ్డి ‘రక్షించండి’ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో వారు ఆ కారులోంచి అతడిని రక్షించి.. నిందితులను అరెస్ట్ చేశారు. నడిరోడ్డులో కౌన్సెలింగ్.. కిడ్నాపర్లు రాజశేఖర, పింజరి బాబు, సురేంద్ర, లక్ష్మన్నకు పోలీసులు బుధవారం రాత్రి బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడబోమని.. ఎలాంటి సమస్యనైనా న్యాయస్థానం, పోలీసుల సమక్షంలోనే పరిష్కరించుకుంటామని చెప్పిస్తూ వారిచేత దండాలు పెట్టించారు. అనంతరం సీఐ గోరట్ల మాధవ్ మాట్లాడుతూ పెరుగుతున్న నేరాలను నియంత్రించే క్రమంలో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేరగాళ్ల పీచమణచే పనిలో పడ్డామని తెలిపారు. సమస్య ఎంత కఠినమైనదైనా దానికి ప్రాణాలు తీయడమో, ఒక మనిషిని బెదిరించడమో సరైన మార్గం కాదన్నారు. కౌన్సెలింగ్ ఆపేది లేదని స్పష్టం చేశారు. -
వెంకటగిరిలో మహిళల భారీ ర్యాలీ
సాక్షి, నెల్లూరు: పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు 52 రోజులుగా ఉద్యమబాటలో అలుపెరగని పయనం సాగిస్తున్నారు. ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా ఇక్కడి నుంచే సమైక్య శంఖారావం పూరిస్తున్నారు. రోజుకో వినూత్న కార్యక్రమంతో సమైక్య భేరి మోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. వీఆర్సీ సెంటర్లో ఉపాధ్యాయులు(యూటీఎఫ్), గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు బస్సుకు తాళ్లు కట్టి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు లాగారు. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కావలి లోని జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మత్స్యకారులు వలలు, బోట్లతో ర్యాలీ చేశారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, కోదండరామ్ మాస్క్‌లు ధరించిన వారితో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్డీఓ, జేబీ కళాశాల యాజ మాన్యం ఆధ్వర్యంలో జేబీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సమైక్య క్రీడాజ్యోతి ర్యాలీ సాగింది. పొదలకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్ష చేశారు. వీరికి తహశీల్దార్,ఎంపీడీఓ సంఘీభావం తెలిపారు. వెంకటగిరిలో జేఎసీ ఆధ్వ ర్యంలో మహిళాగర్జన నిర్వహించారు. పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు వేలాదిగా తరలివచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా స్థానిక కాశీపేట కూడలిలో ఏర్పాటుచేసిన సభాస్థలికి తరలివచ్చారు. 50 రోజులుగా ఉద్యమం హోరెత్తుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ రాపూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మండిపడ్డారు. సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు రిలే దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నేతల దీక్షలు కొనసాగాయి. సీతారాంపురం బస్టాండు సెంటర్లో రిలే దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. వింజమూరులో ఉద్యోగ జేఏసీ దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో రిలేదీక్ష లో ఉన్న వారికి లోక్‌సత్తా పార్టీ నేత కేవీ కృష్ణయ్య మద్దతు పలికారు. విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారంగా నిలిచారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవులు కోటక్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన విజయకుమార్ హాజరయ్యారు. వాకాడులో కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. చిట్టమూరులో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మోకాళ్ల నిలిచి నిరసన తెలిపారు. ఆత్మకూరులోని బస్టాండు సెంటర్లో అధ్యాపకులు రిలేదీక్షలో కూర్చున్నారు. నెల్లూరుపాళెం సెంటర్లో ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సంగంలో ర్యాలీ జరిగింది. చేజర్లలోని బస్టాండు సెంటర్లో ఉపాధ్యాయులు రిలేదీక్షలో కూర్చున్నారు. బుచ్చిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో షుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు రిలేదీక్షలో కూర్చున్నారు.కొడవలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఇందుకూరుపేటలోని బస్టాండు సెంటర్లో మానవహారంగా నిలుచుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. మంగళంపాడు సర్పం చ్తో పాటు పలుశాఖల ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. తడలో రోడ్డుపైనే క్షవరం చేసి నాయీ బ్రాహ్మణులు నిరసన తెలిపారు.