తెలంగాణకే సొంతం ‘బతుకమ్మ’ | telangana state festival bathukamma | Sakshi
Sakshi News home page

తెలంగాణకే సొంతం ‘బతుకమ్మ’

Published Sun, Sep 21 2014 2:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

తెలంగాణకే సొంతం ‘బతుకమ్మ’ - Sakshi

తెలంగాణకే సొంతం ‘బతుకమ్మ’

జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : బతుకమ్మ పండగ తెలంగాణకే సొంతమని, జిల్లావ్యాప్తంగా దీనిని వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సూ చించారు. శనివారం దీని నిర్వహణపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ప్రకృతి పండగ అని, కేవలం పూలతోనే తెలంగాణలో తప్పా మరెక్కడా కనిపించదన్నా రు. ఈ ఉత్సవాల్లో మన జీవన శైలి ఆవి ష్కరించాలన్నారు. ఇందులోభాగంగా ఈ నెల 24న అన్ని గ్రామాల్లో, 26న మండలస్థాయిలో, 28న డివిజన్‌స్థాయిలో, 30 న జిల్లాస్థాయిలో, అక్టోబర్ 2న రాష్ట్రస్థాయిలో కొనసాగుతాయన్నారు.

గ్రామస్థాయిలో ప్రతి ఇంటా బతుకమ్మ వెలసేలా చూడాలని, నిర్వహించే ప్రదేశాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. బతుకమ్మను నిమజ్జనం చేసే కుంటలు, చెరువులను శుభ్రంగా ఉంచడంతో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలని, కుంటలకు వెళ్లే రహదారులపై చెట్లు, ముళ్లపొదళ్లు లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల్లో బతుకమ్మలకు పోటీలు నిర్వహిస్తామని, గ్రామస్థాయిలో గెలుపొందిన మొదటి బతుకమ్మకు వేయి, రెండో బహుమతికి 500, మూడో బహుమతిగా  300 ఇస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఉత్సవాలకు జిల్లా చరిత్ర, సంస్కృతి ప్రస్పుటమయ్యేలా శకటాన్ని రూపొం దించి, కళాకారులను హైదారబాద్‌కు పంపిస్తామన్నారు.

సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని, ఎన్‌ఆర్‌ఎం నిధులను సర్పంచ్‌లు డ్రా చేసేలా అధికారం కల్పిం చాలని, వ్యక్తిగత మరుగుదొడ్లకు 15 వేల చొప్పున కేటాయించాల కోరారు. అనంతరం బతుకమ్మ పండగపై రూపొం దించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం, ఇన్‌చార్జి సీఈఓ నాగమ్మ, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌వీఎం పీఓ కుసుమకుమారి, హార్టికల్చర్ ఏడీ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement