
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిరోధించి బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.జవహర్‌రెడ్డి ఓ లేఖ రాశారు. కరోనాను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గట్టి చర్యలు చేపట్టారని, దీనికి అంతా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
► సర్జికల్ మాస్కులు, ఎన్ 95 మాస్కులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌లు, శానిటైజర్లు సాయంగా అందించవచ్చు.
► మొబైల్ ఎక్స్‌రే మెషీన్లు, వెంటిలేటర్లు, పల్సాక్సీ మీటర్లు, బై–పాప్స్‌లను అందించండి
► స్పెషలిస్టు వైద్యులు, ఎంబీబీఎస్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలందించండి.
► 25 నుంచి 35 ఏళ్లలోపు వారు క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డుల వద్ద పనిచేయడానికి ముందుకు రావాలి.
► ఐసొలేషన్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాలు, హాస్పిటళ్లకు ఆహారం, మంచినీరు, దుస్తులు, పారిశుధ్య నిర్వహణకు ముందుకు రావాలి.
► ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పిస్తుంది.
► జిల్లా కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారులకు సాయం వివరాలు అందించవచ్చు.