రెండూ రోజూ కొనసాగిన అవగాహన కార్యక్రమం | development of the understanding of the founding trustees of temples | Sakshi
Sakshi News home page

రెండూ రోజూ కొనసాగిన అవగాహన కార్యక్రమం

Published Thu, Jul 14 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

development of the understanding of the founding trustees of temples

 అన్నవరం: రాష్ట్ర దేవాలయ పాలనాసంస్థ (సీట) ఆధ్యర్యంలో అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై  విష్ణుసదన్ సత్రంలో నిర్వహిస్తున్న ‘ఆలయాల అభివృద్ధిపై  వ్యవస్థాపక ధర్మకర్తలకు అవగాహన’ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది.
 
  ఈ కార్యక్రమానికి సీట డెరైక్టర్ సీహెచ్ విజయ రాఘవాచార్యులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా ఈఓ కె. నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధిలో ధర్మకర్తలు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వం నుంచి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు లభిస్తాయి తదితర విషయాలపై  ఉదయం నుంచి సాయంత్రం వరకూ  ప్రసంగాలు కొనసాగాయి.
 
  ఈ సందర్భంగా ధర్మకర్తల విధులకు సంబంధించిన ‘సీట’ ముద్రించిన బుక్‌లెట్లను పంపిణీ చేశారు. సీట డిఫ్యూటీ డెరైక్టర్ చంద్రశేఖరరావు, విశ్రాంతి ఏసీ ప్రకాశరావు, దేవస్థానం పీఆర్‌ఓ తులా రాము, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  గురువారం ఉదయం జరిగే కార్యక్రమంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement