సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. ‘స్పందన కార్యక‍్రమం’ పేరుతో ప్రతి ఎస్పీ, సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో స్పందన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల మాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన‍్నట్లు తెలిపారు. కాగా వైఎస్సార్ సీపీ, టీడీపీ నుంచి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment